
కాగజ్ నగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పోలీసుల ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. యూత్ బెట్టింగ్, డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీసులు- మీ కోసంలో భాగంగా కౌటాల పోలీస్‌స్టేషన్ ఆవరణలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజంతో కలిసి ఎస్పీ ప్రారంభించారు.
ఆయన మాట్లా డుతూ.. జిల్లాలోని 15 మండలాల నుంచి మొత్తం 65 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచిన జట్టుకు రూ.20 వేలు, సెకండ్, థర్డ్ ప్లేస్‌లో నిలిచే జట్లకు రూ.15, రూ.10 వేల నగదు బహుమతి, ట్రోఫీలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బెట్టింగ్ పూర్తిగా నిషేధమని, బెట్టింగ్ జోలికి పోయి యువత తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్, టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాసరావు, సబ్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.